వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్యవర్థన్ ను రెండో జూనియర్ సివిల్ జడ్జీ కోర్టుకు తీసుకెల్లారు పటమట పోలీసులు. మెజిస్ట్రేట్ ఎదుట సత్య వర్థన్ 164 స్టేట్ మెంట్ రికార్డు చేసారు. టీడీపీ గన్నవరం కార్యాలయం పై దాడి కేసులో ఈనెల 10వ తరగతి సత్యవర్థన్ కేసు వాపస్ తీసుకున్న విషయం విధితమే. కేసు వెనక్కి తీసుకోవాలని వంశీ.. సత్యవర్తన్ ను బెదిరించారని నమోదు అయిన కేసులో తాజాగా మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్థన్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు.
మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు విచారణకు స్వీకరించింది విజయవాడలోని ఎస్టీ, ఎస్సీ కోర్టు. అనారోగ్యం కారణంగా బెడ్ తో పాటు ఇంటి నుంచి ఆహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలు అయిన పిటిషన్ కూడా విచారనకు స్వీకరించింది న్యాయస్థానం. ఈ వ్యవహారంలో ఇరు పక్షాలు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఏపీ హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేసు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రేపు మాజీ సీఎం జగన్ వంశీని పరామర్శించనున్నారు.