దేవరకొండ గురుకులంలో దారుణం.. ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్‌ !

-

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని మైనార్టీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. నిన్నటి నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్‌ అయినట్లు చెబుతున్నారు. ఇక ఈ అంశంపై గురుకుల పాఠశాల నిర్వాహకులు అలర్ట్‌ అయ్యారు.

Three students have gone missing in a minority gurukulam in Devarakonda town of Nalgonda district

పోలీసులకు ఫిర్యాదు చేసిన గురుకుల పాఠశాల నిర్వాహకులు…దీనిపై పిల్లల కుటుంబాలకు కూడా సమాచారం అందించారు. మిస్సింగ్‌ అయిన ముగ్గురు విద్యార్థులు.. పదవ తరగతి చదువుతున్నారని సమాచారం.

నిన్నటి నుండి కనిపించకుండా పోయారట విద్యార్థులు. అదృష్యమైన విద్యార్థులు తౌఫిక్ ఉమర్, అబ్దుల్ రెహమాన్, ముజీబ్ లుగా గుర్తించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news