అనంతపురంలో లంచం తీసుకుంటూ దొరికిన ఎంఈఓ

-

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ పని కోసం అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమతుల కోసం అన్ని పక్కాగా ఉన్నా.. నిబంధనలు పాటించినా రూ.2 లక్షలు లంచం ఇస్తే గానీ పని చేయడం కుదరని గత కొంతకాలంగా తిప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఆ ప్రభుత్వ అధికారిని ఏసీబీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

వివరాల్లోకివెళితే.. బళ్లారి ప్రాంతంలో ఎంఈవోగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి చంద్రశేఖర్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు పట్టుబడ్డాడు.ఓ ప్రైవేటు స్కూల్‌కు అనుమతుల మంజూరు కోసం ఆయన లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. బాధిత వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో అతన్ని సులువుగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని విచారణ అనంతరం పోలీసులకు అప్పగించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news