Virat Kohli : ఇలాగేనా ఆడేది? కోహ్లిపై గంభీర్‌ ఫైర్

-

నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌ లో కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఆటతీరుపై గంభీర్ విమర్శలు గుప్పించారు. చెత్తషాట్ తో మూల్యం చెల్లించుకున్నాడని మండిపడ్డారు. ‘అసలు అదేం షాట్? ఫార్వర్డ్ కాదు… బ్యాక్ కాదు. నార్మల్ షాట్.

gambhir slams virat kohli

షాహిన్ బౌలింగ్ లో ఇలాగేనా ఆడేది? ఫార్వర్డ్ షాట్ ఆడాలా లేదంటే బ్యాక్ కు వెళ్లాలా అనే విషయంలో ఆ మాత్రం క్లారిటీ లేదా?’ అని విమర్శించారు. షాహిన్ బౌలింగ్ లో కోహ్లీ బాల్ ను ఫ్లిక్ చేయగా ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని బంతి స్టంప్స్ ను తాకింది. కాగా, ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలా మ్యాచ్ రద్దు కావడం ఆసియా కప్ లో ఇది రెండవసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version