ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

-

దేశ రాజధాని ఢిల్లీల్లో ఎప్పటి నుండో ఎన్నికల సందడి అనేది ప్రారంభమైన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు రాజధానిలో జెండాపాతడానికి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ఎన్నికల నగారా అనేది మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 10 విడుదల చేస్తే.. ఫిబ్రవరి 5న ఢిల్లీలో పోలింగ్ జరుగుతుంది.

ఇక ఎన్నికలు ముగిసిన మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు అనేవి ప్రకటిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17 వ తేదీకాగా.. వేసిన నామినేషన్లను 20వ తేదీ లోపు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈసారి ఢిల్లీలో ఎన్నికల కోసం మొత్తం 13000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈసారి ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 1 కోటి 55 లక్షలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news