Thummala nageswara rao good news to nethanna: తెలంగాణ నేతన్నలకు శుభవార్త అందించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రూ. 90 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
గత ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద బకాయి పెట్టిన నిధులతో సహా ఎలాంటి బకాయిలు లేకుండా నిధుల విడుదల చేసినట్లు చెప్పారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. గత ప్రభుత్వం నేతన్నలకు చేసింది గోరంత, చెప్పు కునేది కొం డత అని విమర్శలు చేశారు. నేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందు కే ఈ రోజు ఎలాంటి బకాయిలు లేకుం డా నిధులు మొత్తం విడుదల చేశామన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.