హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం

-

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద చేరి చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, మలక్‌పేట, ఖైరతాబాద్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరిలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

తెల్లవారుజాము నుంచి నిజాంపేట్, ప్రగతినగర్‌లో వర్షం కురుస్తుండటంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతుకు వర్షపు నీరు చేరుకుంది. మరో 2 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version