తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ హాలిడే. ఇవాళ ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా తోలుత ఈనెల 6న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. తాజాగా ఆ సెలవును 7వ తేదీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఇవాళ సెలవు ఉండనుంది.
భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేని పరిస్థితి ఉంటే ఆ జిల్లా అధికారులు సెలవులు ప్రకటించవచ్చని విద్యాశాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర మొత్తం సెలవులు ఇవ్వలేమని తెలిపింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో కురవవని వివరించింది. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినప్పుడు సిలబస్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.