నేడే కేసీఆర్ పుట్టిన రోజు.. తెలంగాణ రైతు దినోత్స‌వం పేరుతో వేడుక‌లు

-

నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు 68వ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేడుక‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. కాగ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును తెలంగాణ రైతు దినోత్స‌వం పేరుతో టీఆర్ఎస్ నాయ‌కులు, కార్యక‌ర్త‌లు వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల‌ను ఈ నెల 15వ తేదీ నుంచే ప్రారంభించారు. వేడుక‌లు నేటితో పూర్తి కానున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అన్న‌దానాలు, ర‌క్త ద‌నాలు, మొక్క‌లు నాట‌డం వంటి కార్యక్ర‌మాలు చేస్తున్నారు.

అలాగే రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల‌లో వాలీబాల్ తో పాటు ప‌లు ఆట‌ల పోటీల‌ను నిర్వ‌హించారు. నేడు తెలంగాణ భవ‌న్ లో మెగా ర‌క్త దాన శిబిరం ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ ప‌లు కార్య‌క్ర‌మాలకు సిద్ధం అవుతున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే పేరు తో దివ్యాంగుల‌కు మూడు చ‌క్రాల వాహానాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. అలాగే కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాజ్య స‌భ ఎంపీ జోగిని ప‌ల్లి సంతోష్ కుమార్ ప్ర‌త్యేక పాట ను రూపొందించారు. ఈ పాట‌ను రాష్ట్ర హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ ఆవిష్క‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news