తెలంగాణ వాహనదారులకు అలర్ట్..ట్రాఫిక్ చలాన్లపై నేడే చివరి తేదీ కానుంది. ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాల్టితో ముగియనుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ లభిస్తోంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ సేవ, ఆన్లైన్, యూపీఐ ద్వారా చలాన్లు చెల్లించవచ్చు. సందేహాలు ఉంటే 040-27852721, 8712661690 నంబర్లలో సంప్రదించాలి.