రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి…కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాదమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం సమావేశంలో కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడుతూ…ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని స్పష్టం చేశారు కేటీఆర్.
ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల ప్రజాపాలన దరఖాస్తులు బహిర్గతమైనట్లు వస్తున్న వార్తలను చూశానని ,ఆ దరఖాస్తులలో కోట్లాదిమంది తెలంగాణ ప్రజల సెన్సిటివ్ డేటా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎవరైనా కాల్ చేసి ఆరు గ్యారంటీలు మంజూరయ్యాయని.. ఓటీపీ అడిగితే చెప్పవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా.. ఓటు వేయకపోయినా సరే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలను సీరియస్‌గా తీసుకుని సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని కోరారు.