డ్రగ్స్ నియంత్రణ పై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రగ్స్ దందా చేసే వారిపై, డ్రగ్స్ కి సంబంధించిన ప్రకటనలతో తప్పుదోవ పట్టించేవారిపై సాధారణ పౌరులు ఎవరైనా 18005996969 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
అన్ని పని దినాల్లో ఉ. 10:30 నుంచి సా. 5గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుందని డిసిఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి బాంబు కోసం వెతికారు. దాదాపు రెండు మూడు గంటల పాటు ఎయిర్పోర్టును జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని గ్రహించారు.