ఇంట్లో దొంగతనం.. బీరువాలో నగలు.. నగదు.. ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు చోరీ

-

టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. బంగారం లాగే టమాటాలను కూడా భద్రంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలే ఓ ప్రాంతంలో టమాటాల లోడ్ ను దొంగిలించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగలు నగదుతో పాటు టమాటాలు కూడా దొంగిలించారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

బోధన్ పట్టణంలోని గౌడ్స్‌ కాలనీకి చెందిన మున్సిపల్‌ ఉద్యోగి రఫీ కుటుంబం సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.28 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ తెరిచి ఉండటంతో అందులో పరిశీలించగా కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడు రఫీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పీటర్‌, క్లూస్‌ టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version