ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పింది. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలి. ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇస్తాం. కొత్త వాళ్ళు వచ్చిన చోట వాళ్ళను గౌరవించుకోవాలి. పాత కొత్త కలయిక తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని తెలిపారు.
అలాగే కొత్త పాత నాయకులను మిక్స్ చెయ్యాలి అని పేర్కొన పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్సేలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేటీఆర్ తో రోజు ఇన్ అండ్ అవుట్ టచ్ లో ఉన్న వాళ్ళు.. మాతో టచ్ లో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తాం అని అన్నారు.. అందుకే చేరకిలు జరిగాయి అని పేర్కొన్నారు.