అయ్య ఔరంగాబాద్ లో.. కొడుకు ప్లీనరీలతో ఊరేగుతున్నారు – రేవంత్ రెడ్డి

-

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో కోతకొచ్చిన వరి కూడా దెబ్బతిన్నది. పలుచోట్ల ఐకెపి కేంద్రాలలో వర్షపు నీరు చేరి వరి ధాన్యం తడిసింది. మరోవైపు ఈదురు గాలులకు మామిడికాయలు కూడా రాలిపోయాయి. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు తాజా వర్షాలతో మరింత ఇబ్బందుల్లోకి వెళ్లారు.

అంది వచ్చిన పంట నేలపాలు అయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతుల సమస్యలు లేవనెత్తుతూ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. “అకాల వర్షాలతో జిల్లాలలో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్య ఔరంగాబాద్ లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకొని ఊరేగుతున్నారు. వీళ్లకు మానవత్వం ఉందా.. బాధ్యత ఉందా.. ఇది ప్రభుత్వమేనా..? రైతు – యువత ఏకమై బిఆర్ఎస్ ను బొంద పెట్టే సమయం వస్తుంది” అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news