తెలంగాణ, ఏపీకు మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి.
దీంతో రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి భారీ వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C (డిగ్రీల సెంటీగ్రేడ్) కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు,రేపు తెలంగాణ, ఏపీ రాష్ట్రములో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ( గా లి గంట కు 40 నుండి 50 కిమీ వేగం తో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.