ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ఆపండి..టాలీవుడ్‌ ను కోరిన కాంగ్రెస్‌ !

-

తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్‌ గౌడ్‌ సంచలన ప్రకటన చేశారు. సినీ పెద్దలారా మీరు.. ఇక కొండా సురేఖ అంశాన్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్‌ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్‌ గౌడ్‌. ఇక ఆపేయండి..అంటూ సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండని కోరారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్‌ గౌడ్‌.

అటు ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. అనుకోకుండా ఆ వ్యాఖ్యలు నా నోటి నుంచి వచ్చాయన్నారు కొండా సురేఖ. నాకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని వెల్లడించారు. తరువాత వాళ్ల ట్వీట్స్ చూసి నేను బాధపడ్డానని పేర్కొన్నారు మం త్రి కొండా సురేఖ. ఏ విషయంలో అయితే నేను బాధపడుతున్నానో అదే విషయంలో నేను ఇంకొకరిని నొప్పించానని తెలిసి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news