హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9010203626 నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు.

- Advertisement -

ఈ మార్గాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు

  • పబ్లిక్‌గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు
  • ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు
  • బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లింపు
  • ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు

మరోవైపు ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉండటంతో మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...