తెలంగాణ సీఎంగా ఆ దస్త్రంపైనే రేవంత్‌ రెడ్డి తొలి సంతకం

-

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళమధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ తన తొలి సంతకం ఏ దస్త్రంపై పెడతారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రేవంత్ రెడ్డి సీఎంగా ‘ఆరు గ్యారంటీల’ చట్టానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు. మరోవైపు రేవంత్​తో పాటు మరికొద్ది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకంగా.. సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రె డ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్‌ నాయకులు అందజేయగా.. గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రొటోకాల్‌ ప్రకారం.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే సహా పలువురు ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా ఆహ్వానం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news