విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం పెను విషాదం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇవాళ .. ప్రధాన రైళ్లయిన హవ్డా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హవ్డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్, షాలిమార్- హైదరాబాద్ (18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
వీటితో పాటు తిరుపతి-పూరీ (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ (08531) ప్యాసింజర్, తిరుపతి-విశాఖ (08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ (17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వివరించారు.