Tirumala : తిరుమల భక్తులకు అలర్ట్…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న ఒక్క రోజు 4 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. అటు టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే 69,654 మంది భక్తులు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న ఒక్క రోజే 23,978 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ.3.34 కోట్లుగా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా…. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 10 నుంచి 18 వరకు తిరుమల తరహాలో వైభవంగా నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. 10న ధ్వజారోహణం, 14న గజవాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం ఉంటాయన్నారు. 18న పంచమితీర్థం సందర్భంగా లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని వివరించారు.