ఈడీ విచారణకు హాజరైన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

-

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) అధికారులు విచారిస్తున్నారు. మంచి రెడ్డి కిషన్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడారని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంచి రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఈడి అధికారులు.

చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో మంచి రెడ్డి కిషన్ రెడ్డి కూడా ఒకరు. ఈ నోటీసుల ఆధారంగానే ఆయన నేడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంచి రెడ్డి నుంచి ఈడీ అధికారులు స్టేట్మెంట్ నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version