“వంటలక్క, డాక్టర్‌ బాబు”ను ఓ రేంజ్‌ వాడేసుకున్న సజ్జనార్‌ !

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

ఈ నేపథ్యంలో అనేక సినిమా క్లిప్పింగ్ లను ఆయన షేర్ చేశారు. ఇంకా సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కార్తీక దీపం సీరియల్‌ లోని వంటలక్క, డాక్టర్‌ బాబూ క్యారెక్టర్లను కూడా వాడేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. వారిద్దరి ఫోటోలను వాడుతూ.. ఆర్టీసీ హైప్‌ ను పెంచుకున్నారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే.. అందరికీ సురక్షితమనే సందేశం వచ్చేలా.. ఫోటోలను షేర్‌ చేసింది ఆర్టీసీ. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news