సైబర్ నేరాల కట్టడికై ఆర్బీఐకి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రిక్వెస్ట్

-

సైబర్‌ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసు శాఖ ఈ నేరాల కట్టడికి మరో కీలక అడుగు ముందుకేశారు. సైబర్ నేరాల కట్టడికి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అధికారులు నేరాలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కు ఇటీవల కొన్ని సూచనలతో కూడిన విజ్ఞప్తులు చేశారు.

సైబర్ నేరాల్లో నగదు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయడంలో అనవసర జాప్యం నివారిస్తే ఫలితం ఉంటుందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు ఆర్బీఐకి సూచించారు. సైబర్ క్రైమ్ జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు ఇవ్వగానే అధికారులు ఆ వివరాలు బ్యాంకుకు అందజేస్తే.. బాధితుడి ఖాతా నుంచి ఏ ఖాతాలో డబ్బు జమైందో బ్యాంకు గుర్తించి సదరు లావాదేవీని వెంటనే నిలిపివేయాల్సి ఉంటుంది. బ్యాంకుల మధ్య సమన్వయం లేకపోవడం, అవగాహనా లోపం వంటి వాటివల్ల త్వరగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు వచ్చిన వెంటనే లావాదేవీ నిలిపివేసేందుకు బ్యాంకులు అవసరమైతే ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆర్బీఐకి సూచించారు. దీనికి ఆర్బీఐ అంగీకరించిందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news