కేసీఆర్‌ మాస్టర్‌ క్లాస్‌.. గులాబీ బాస్ ఇంటర్వ్యూపై కేటీఆర్‌ ట్వీట్

-

దాదాపు పుష్కర కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ టీవీ ఛానెల్కు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ ఇంటర్వ్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గులాబీ బాస్ మారథాన్‌ ఇంటర్వ్యూను కేటీఆర్‌.. ‘మాస్టర్‌ క్లాస్‌’గా అభివర్ణించారు. ‘ఇది కేసీఆర్‌ మాస్టర్‌ క్లాస్‌…. ‘ఫాం తాత్కాలికం.. క్లాస్‌ శాశ్వతం’ అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు కేసీఆర్ ఇంటర్వ్యూ రికార్డులు సృష్టిస్తోంది. 4 గంటలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూకు సుమారు 95 వేలకు పైగా నాన్‌స్టాప్‌ లైవ్‌ వ్యూస్‌ రావడం గమనార్హం. వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఈ స్థాయిలో భారీ లైవ్‌ వ్యూస్‌ రావడం రికార్డనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి గ్రామాలు మొదలు, పట్టణాలు, మెట్రో సిటీల వరకూ లక్షలాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. ఈ ఇంటర్వ్యూలో కేసీఆర్ నీటిపారుదల శాఖ ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు, విద్యుత్తు, ఆర్థిక, తాగునీటి తదితర రంగాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news