గ్రూప్-1 రద్దుపై హైకోర్టు తీర్పుపై.. డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పీఎస్‌సీ

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపల్ లీక్ కేసు వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అప్పట్లో రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దయిన పరీక్షను మళ్లీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. అయితే ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి విచారణ చేపట్టిన హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై టీఎస్పీఎస్సీ కమిషన్ స్పందించినట్లు సమాచారం. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌ – 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులు ఇప్పటికే ఓసారి నష్టపోయారని.. మరోసారి వారికి నష్టం జరగకూడదని భావిస్తున్న కమిషన్.. డివిజన్ బెంచ్​కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news