డ్రింకింగ్ వాటర్ బిజినెస్ లోకి టీఎస్ఆర్టీసీ.. బ్రాండ్ పేరు ఇదే

-

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై తెలంగాణ ఆర్టీసీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్గో సేవలు వంటి ప్రత్యామ్నాయాలను అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా మరో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోంది ఆర్టీసీ. ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్టీసీ.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది.

మిగతా కంపెనీల మంచినీళ్ల బాటిళ్లు ఇవ్వడం కంటే సొంత బ్రాండ్‌తో తయారుచేసి అందించాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఆర్టీసీ విక్రయించే వాటర్‌ బాటిళ్లకు జీవా అనే పేరును ఖరారు చేసింది. జీవా అంటే తేజస్సు, ప్రకాశం, కాంతి అనిఅర్థం. అందుకు తగ్గట్టుగానే వాటర్‌ బాటిల్‌ను డిజైన్‌ చేశారు.

జీవావాటర్‌ బాటిళ్లను ఏసీ బస్సు ప్రయాణికులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. బస్టాండ్లలోని స్టాళ్లలో విక్రయించనున్నట్లు తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో తేనున్నట్లు వెల్లడించింది. ఇవాళ హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ బ్రాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news