తప్పులు సరిదిద్దుకోకుంటే కట్టిన చర్యలు తప్పవు : టీటీడీ చైర్మన్

-

తిరుమల టీటీడీ పాలకమండలి నిర్ణయాలు తీసుకుందని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు.  సనాతన దర్మాప్రచారం విసృతంగా జరగాలని…యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరగాడానికి కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తాం అని తెలిపారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతి,యవతులు రామకోటి తరహలో గోవిందకోటిని వ్రాసిన వారికి…..వారి కుటుంభసభ్యులకు విఐపి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తాం.
10 లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు వ్రాసిన వారికి దర్శనభాగ్యం కల్పిస్తాం అని తెలిపారు.
మన రాష్ట్రంలోని  ఎల్ కేజి నుంచి పిజి వరకు చదివే విద్యార్దులుకు భగవద్గీత సారాంశాని….కోటి పుస్తకాలు పంపిణి చేస్తాం. ఈనెల  18వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 2024 సంవత్సరాల డైరిలు,క్యాలండర్లును సియం జగన్ ప్రారంభిస్తారు. ముంబాయిలోని బాంద్రాలో 5.35 కోట్లతో టిటిడి సమాచార కేంద్రం…1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అదేవిధంగా  49.5 కోట్లతో టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనలుకు కేటాయింపు, టిటిడి పోటులో 413 పోస్టులు భర్తికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేశారు.
2.46 కోట్లతో టిటిడి ఆసుపత్రులుకు మందులు కోనుగోలుకు నిర్ణయం తీసుకుంది. టిటిడి ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో 47 అధ్యాపకులు పోస్టులుకు నిర్ణయం.  వడమాలపేట వద్ద టిటిడి ఉద్యోగులుకు ఇంటి స్థలాల వద్ద అభివృద్ది పనులకు 33 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని టిటిడి ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు 4.15 కోట్లు కేటాయింపు చేస్తున్నాం.  తిరుపతిలోని పురాతనమైన 2,3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం,శ్రీపఠం వసతు సముదాయాలను నిర్మిస్తాం అని తెలిపారు. తిరుమల…సనాతన దర్మం పై ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూన్నాం చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తప్పులు సరిదిద్దుకోకుంటే కట్టిన చర్యలు తప్పవు అన్నారు టీటీడీ చైర్మన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version