రైతులకు గుడ్ న్యూస్.. పసుపు ధర క్వింటాకు రూ.13వేలు

-

రైతులకు గుడ్ న్యూస్. ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్‌గా పేరు గడిచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో క్వింటాల్ పసుపు ధర రెట్టింపు అయింది. గత వారం క్వింటా 6వేలు పలికిన ధర ప్రస్తుతం 13 వేలకు చేరింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పసుపు డిమాండ్ పెరగడంతో పాటు పసుపు నిల్వలు గతం కంటే తగ్గడంతో వ్యవసాయ మార్కెట్లో మంచి ధరలు దక్కుతుందంటున్నారు రైతులు. మరోవైపు.. రాబోయే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

మార్కెట్ యార్డుల్లో పసుపునకు మంచి ధర పలుకుతున్నప్పటికీ అది రైతులందరికీ దక్కడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఒకరిద్దరికి మాత్రమే 13వేలు చెల్లించి.. మిగిలిన రైతులకు 10వేల నుంచి 11 వేల మధ్య మాత్రమే వ్యాపారులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ… గతంతో పోలిస్తే సాగు ఖర్చులు పెరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం పసుపునకు 15 వేల రూపాయలను మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news