రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై టస్కర్ బీభత్సం…ఒకరు మృతి

-

 

రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు పై టస్కర్ వాహనం బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా..ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు పై టస్కర్ వాహనం బీభత్సం సృష్టించింది.

హిమాయత్ సాగర్ Exit 17 వద్ద ఆగి ఉన్న ఓ కారును ఢీ కొట్టింది టస్కర్. ఈ తరుణంలోనే ఆ కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా… ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టస్కర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version