జంట జలాశయాల్లోకి భారీగా వరద ప్రవాహం

-

హైదరాబాద్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చాలా ప్రాంతాలు వరద ఉద్ధృతికి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకూడదని చెబుతున్నారు. మరోవైపు నగరంలోని ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ జలాశయం 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

హిమాయత్ సాగర్‌కు 1,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. జలాశయం నుంచి మూసీలోకి 1350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1761.45 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్‌కు 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం రెండు గేట్ల ద్వారా 216 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1787.20 అడుగులుగా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version