కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువతి, యువకులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు నిర్వహించారు.

రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడు వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే అశోక్ నాయుడు టార్గెట్ చేశారు. AP 39 SR 0001 నెంబరు ఫార్చునర్ కారుకు లోక్ సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్నాడట అశోక్. ఎంపీ స్టిక్కర్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడనే దానిపై విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు.