ఇక నుంచి ప్రతీ పల్లెటూరికి ఒక వైన్స్ తీసుకువచ్చేలా.. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలు పెంచేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం… వరుస ఎన్నికలు ఉండడంతో ముందస్తు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిందట. అయితే దీనిపై కేటీఆర్ స్పందించారు. నాడు కేసీఆర్ గారి పాలనలో పల్లె, పల్లెకు ప్రగతి రథచక్రాలు… ప్రతి చేనుకు నీళ్లు
ప్రతి చేతికి పని… ఇంటింటికి తాగునీళ్లు అని పేర్కొన్నారు.

నేడు పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర అంటూ వ్యాఖ్యనించారు. అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి .. ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు. ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897… ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సగటున ఒక వ్యక్తి మద్యం మీద చేస్తున్న ఖర్చు రూ.1623కు పెరిగిందని మండిపడ్డారు.