రామగుండం రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్..!

రామగుండం ఎన్టీపీసీ సమీపంలో రియల్టర్ ను అత్యంత కిరాతకంగా చంపిన నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసారు. రియల్టర్ కు కొడుకు వరసయ్యే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భూతగాదాలే రియల్టర్ హత్యకు కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రామగుండం సమీపంలోని కాజిపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ గా పని చేసేవాడు. ఇటీవల అతనికీ కొడుకు వరసయ్యే మేకల కుమారస్వామితో కలిసి భూముల కొనుగోలు, అమ్మకం చేయ సాగాడు. బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ తో పాటు పాల వ్యాపారం కూడా చేశారు. అయితే ఈ క్రమంలో వీరి మధ్య వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. తేడాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే లింగయ్య హత్యకు కుమారస్వామి కుట్ర పన్నినట్లు సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు.