“ఐసీసీ ర్యాంకింగ్ లో ఇండియా ఆధిపత్యం”

-

ఇండియా క్రికెట్ జట్టు ఆసియా కప్ లో చేసిన ప్రదర్శన పట్ల అభిమానులు, జట్టు యాజమాన్యం మరియు సీనియర్ క్రికెటర్లు అందరూ హ్యాపీ అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఒక లీగ్ లో టైటిల్ కొట్టిన తర్వాత అంతకన్నా మంచి ప్రదర్శన ఇంకేముంటుంది చెప్పండి. ఈ ప్రదర్శనతో వ్యక్తిగతంగా మరియు టీం పరంగా ఐసీసీ ర్యాంక్ లలో బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇక ఒకసారి ఐసీసీ ర్యాంకింగ్ చూస్తే.. ఇండియా ఒక జట్టుగా ఇప్పటికే టెస్ట్ లు మరియు టీ 20 లలో మొదటి స్థానంలో ఉంది. వన్ డే లలో మాత్రం రెండవ స్థానంలో సరిపెట్టుకుంది.. బ్యాటింగ్ విభాగంలో చూస్తే..టీ 20 ర్యాంకింగ్ లో సూర్య కుమార్ యాదవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ మొదటి స్థానంలో మరియు ఆల్ రౌండర్ ల విభాగంలో రవీంద్ర జడేజా మొదటి స్థానాల్లో ఉన్నారు.

ఇక ఆసియా కప్ లో ఫైనల్ లో చేసిన ప్రదర్శనకు గానూ సిరాజ్ కెరీర్ లోనే మొదటిసారి వన్ డే లలో మొదటి ర్యాంక్ ను సాధించాడు. ఇక ఆస్ట్రేలియా తో రెండు రోజుల్లో మొదలు కానున్న వన్ డే సిరీస్ లో ఇండియా గెలిస్తే వన్ డే లలోనూ మొదటి స్థానానికి చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news