లైవ్‌ వీడియో: థ్రెడ్‌మిల్‌ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థి

-

ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది జిమ్‌,యోగా చేస్తుంటారు. కానీ ఇవి మన ప్రాణం తీస్తే..? మీరు వినే ఉంటారు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయి చనిపోయారు అని.. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు జిమ్‌కు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. తాజాగా యూపీలో ఒక అతను థ్రెడ్‌మిల్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడే గుండెపోటుతో మరణించాడు. అతను వయసులో ఏం పెద్దవాడు కూడా కాదు.. కేవలం ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న యువకుడు ఇలా చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

యూపీలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో ట్రెడ్‌మిల్ చేస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం జిమ్ సిబ్బందిని టెన్షన్ పెట్టింది. కింద పడిపోగానే జిమ్ సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందో చూశారు. అప్పటికే పల్స్ పడిపోయాయి. ఊపిరి ఆగిపోయింది. రోజూలాగే వచ్చి జిమ్ చేసుకుంటున్న యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం షాక్‌కి గురి చేసింది. 10 నిముషాల క్రితమే ఇంటికి కాల్ చేసి తన తల్లితో మాట్లాడినట్టు స్నేహితులు చెబుతున్నారు. జిమ్‌లో పని చేసే ఇద్దరు వ్యక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రెడ్‌మిల్ చేసుకుంటూ పడిపోయాడని వైద్యులకు వివరించారు. పరీక్షించిన వైద్యులు హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడని చెప్పారు.

ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. జిమ్‌ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఓ నటుడు ఇలానే జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా ఇలానే వ్యాయామం చేస్తూ మృతి చెందాడు. ఆరోగ్యంగా ఉండాలనుకోవడమే వాళ్లు చేసిన తప్పా..?ఫిట్‌నెస్ కోసం అవసరానికి మించి వ్యాయామం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్లు చేసే తప్పు. జిమ్‌లోనే ఎక్స్‌ర్‌సైజ్ చేస్తూ హార్ట్‌అటాక్‌తో చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. జిమ్‌ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించి బాడీని కష్టపెడితే ఇలానే జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news