ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఉంచారు.
ఇక అటు రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు తెలంగాన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఒక మీడియా అధినేతకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.