హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. జీతాలు రావడం లేదంటూ 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రవీందర్.. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త గత 17 ఏళ్లుగా ఎంతో సిన్సియర్గా డ్యూటీ నిర్వహించాడని.. నిజాయితీగా పని చేశాడు, నాకు నిబంధనలు ఉల్లంఘించానని ఫైన్ వేశాడని పేర్కొంది హోంగార్డు రవీందర్ భార్య సంధ్య.
నా భర్త ఫోన్ మొత్తం అన్‌లాక్ చేసి డాటా మొత్తం డిలీట్ చేశారు… నా భర్త రవీందర్ ఎంతో తెలివైన వాడని తెలిపారు. నా భర్తతో నేను మాట్లాడిన తరువాతే చంపేశారు..నా భర్తను ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు లు పెట్రోల్ పోసి తగులబెట్టి చంపారని ఆగ్రహించారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు..సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదని మండిపడ్డారు. నా భర్తను చంపిన వారి పై చర్యలు తీసుకోవాలని.. నా కుటుంబానికి న్యాయం చేయాలనికోరారు హోంగార్డు రవీందర్ భార్య సంధ్య.