హోమాలు ఎందుకు చేస్తారు..? ఇంత పెద్ద కారణం ఉందని తెలుసా..?

-

హోమాలు వంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఏదైనా దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కాని చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు హోమాలు చేయాలి. హోమం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందని చాలా మందిలో సందేహం ఉంటుంది. హిందూమత విశ్వాసం ప్రకారం చూసినట్లయితే హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరు జాతకంలోకినైనా దోషము ఉంటే పరిహారం కింద హోమాలు చేసుకోవచ్చు. అప్పుడు కచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది.

సకాలంలో వర్షాలు కురవాలని కూడా హోమాలని చేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు గణపతి హోమాన్ని చేసుకుంటూ ఉంటారు. అలానే శివ హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు వంటివి క్యాన్సల్ అయినప్పుడు కచ్చితంగా శివ హోమం ని చేస్తూ ఉంటారు. విద్యలో వెనకబడినట్లైతే సరస్వతి దేవి హోమాన్ని చేస్తారు. దక్షిణామూర్తి హోమం విద్యా గణపతి హోమం సిద్ది గణపతి హోమాలని కూడా చేస్తూ ఉంటారు.

ఎదుటి వాళ్ల నుండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మహా సుదర్శన హోమాన్ని చేసుకోవాలి. కుబేర లక్ష్మి హోమాన్ని చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు. ధన్వంతరి హోమం చేయడం వలన వ్యాధులు బారిన పడకుండా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇలా హోమాలతో చక్కటి పరిష్కారం కనబడుతుంది. అందుకనే హోమాలని జరుపుతూ ఉంటారు. హోమాల్ని ఎక్కువ ఖర్చు పెట్టి వైభవంగా చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news