ఎల్బీ నగర్ ప్రేమ ఉన్మాది దాడి కేసులో విచారణలో ట్విస్ట్

-

ఎల్బీ నగర్ ప్రేమ ఉన్మాది దాడి కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ప్రియురాలి తమ్ముని చంపాడు శివకుమార్. రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్‌ , యువతి , యువతి తమ్ముడు ముగ్గురూ క్లాస్ మెట్స్. గతంలో నిందితుడి తండ్రిని హత్య చేసిన వ్యవహారం పైనా ఆరా తీస్తున్నారు పోలీసులు.

మూడేళ్ల క్రితం తండ్రి గట్టిగా మందలించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రినీ హత్య చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు శివకుమార్ నేర చర్రితపై విచారణ చేస్తున్నారు పోలీసులు. శివకుమార్ యువతి ఇంటికి వచ్చినప్పటి నుండి.. ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని ఆరా తీస్తున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. పోలీసుల విచారణలో తండ్రి హత్య గురించి నోరు విప్పలేదు నిందితుడు శివకుమార్. తన తండ్రి అనారోగ్యం తో చనిపోయాడు అని చెప్తున్నాడు నిందితుడు. శివకుమార్ గతం పై లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు.. నిందితున్ని ఈ రోజు కోర్టులో హాజరు పరుచనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version