కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ట్విస్ట్ ల మీద ట్విస్టులు..!

-

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మలి జాబితా ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు. మలిజాబితా ప్రకటించడం ఏమో కానీ.. పూటకొక ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విడుతల చేసింది విడుతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. సాయంత్రమే అన్నిస్థానాలకు ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్.

మరోవైపు 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ సీఈసీ. అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 11 స్థానాలను మాత్రం పెండింగ్ లో ఉంచింది. పెండింగ్ జాబితాలో ఖమ్మంలో ఇల్లందు, పాలేరు, నల్గొండ జిల్లాలో దేవరకొండ, తుంగతుర్తి, సూర్యపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్టు సమాచారం. మలిజాబితా ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నట్టు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టత ఇచ్చారు. ఈ తరుణంలో మరో ప్రచారం వినిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి, హరీశ్ రావు సిద్దిపేట, కేటీఆర్ సిరిసిల్ల స్థానాల్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బద్రర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news