ఈ నెల 13 న చేసిన హత్య కేసులో నిందుతులు ధర్మపురి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ధర్మపురి మండలం నెరేళ్ల సాంబశివుని గుట్ట వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన రాహుల్ సూర్య ప్రకాష్ 13న దారుణ హత్య చేసారు. అనంతరం సారంగపూర్ అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పెట్రోల్ తో కాల్చివేశారు నిందితులు ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ మరియు నేరెళ్ల గ్రామానికి చెందిన గండికోట శంకర్ నిందితులు. బొంబాయిలో సారా వ్యాపారం చేస్తున్న గోపాల్ కు అక్కడే సూర్య ప్రకాష్ తో పరిచయం అయ్యింది.
గత రెండు నెలల క్రితం నెరేళ్ల లో తన మిత్రుడు చెప్పిన వ్యక్తిని హత్య చేయాలని సూర్యప్రకాష్ తో సూపరి చేసుకున్నారు గోపాల్. హత్య చేయడానికి సుపారికి 4 లక్షలకు ఒప్పుకున్నాడు సూర్య ప్రకాష్. కొన్ని కారణాలతో హత్య వద్దని చెప్పాడు గోపాల్ మిత్రుడు. ఒప్పుకున్న సుపారి నీ రద్దు చేయాలని సూర్య ప్రకాష్ కు గోపాల్ చెప్పాడు. కానీ ఒప్పుకున్న డబ్బులు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని గోపాల్ పై ఒత్తిడి చేసాడు సూర్య ప్రకాష్. దాంతో సూర్య ప్రకాష్ ను ఎలాగైనా హత్య చేయాలని.. తన మిత్రుడు శేఖర్ తో కలిసి బండరాయితో కొట్టి హత్య చేసాడు గోపాల్. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పెట్రోల్ తో కాల్చివేసిన గోపాల్, శేఖర్.. ఎలాగైనా పట్టుబడతామని ధర్మపురి పోలీసులకు లొంగిపోయారు.