హనుమకొండ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులపై సీఎంకు అవగాహనా ఉందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేస్తారా.. ఆరు గ్యారంటీ లకు ఎంత డబ్బు అవసరమో చెప్పండి.
అసెంబ్లీ వేదిక చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం.. అబద్దాలు ప్రచారం. అభివృద్ధి పనుల కోసం ఏ ప్రభుత్వమైన అప్పులు చేస్తుంది. ఆ మేరకు BRS హయాంలో డెవలప్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు పాలించే శక్తి లేక.. ప్రతి పక్షంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు దాడులు చేస్తోంది. అసెంబ్లీ… సినిమా హల్ ను తలపించింది. అయితే ఆదాని ఇచ్చిన డబ్బులు ఎవరికీ పోయాయో ప్రజలకు తెలుసు. లగచర్ల ఘటన చూస్తే.. శ్రీ లంక పోవాల్సిన పరిస్థితి లేదు KCR రాముడు… రేవంత్ రెడ్డి రావణుడు అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.