కేటీఆర్ కి సన్నిహిత ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్ లో ఉన్నారు : మహేష్ కుమార్ గౌడ్

-

కేటీఆర్ కి సన్నిహిత ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని.. ఎంత మంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు. బీఆర్ఎఉస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ చెందిన పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయా ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జీ ధర్మాసనం జారీ చేసిన ఈ తీర్పు పై సమీక్షించాలని అసెంబ్లీ సెక్రెటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు.. స్పీకర్ ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చని.. టైమ్ బాండ్ పెట్టే అధికారం ఎవ్వరికీ లేదని తీర్పునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news