ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కొత్త చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా ఎన్నికైన వారిలో శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణు కుమార్ రాజు ఉన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రాధాన్య ఓట్ల విధానంలో పీఏసీ సభ్యత్వాలకు పోలింగ్ జరిగింది. బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యా బలం కనీసం 18 ఉండాలి. వైసీపీకీ కేవలం 11 మంది సభ్యులుండటంతో మూడు కమిటీలకు ముగ్గురు వైసీపీ సభ్యులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో పోలింగ్ నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో పీఏసీ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం తొలిసారి. పీఏసీ కమిటీ చైర్మన్ పదవీని అధికార పక్షం మొదటిసారి దక్కించుకుంది. పీఏసీ కమిటీ చైర్మన్ పదవీని ప్రతిపక్షానికి అప్పగించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.