తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పటికే 250కి పైగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించినట్లు లెక్కలు చెబుతన్నాయి. అయితే.. తాజాగా అప్పులు కట్టలేక, రుణమాఫీ కూడా కాకపోవడంతో.. మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌కు చెందిన మోతె రాజు(37) పంట సాగు కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు.
అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురైన రాజు పురుగుల మందు తాగి మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్‌కు చెందిన కళ్లెం లింగయ్య(35)కు సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించే మార్గం కనిపించక పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.