తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు చేశారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఆర్టీసీ వ్యవస్థలో 10-15 సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపో లు ఏర్పాటు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నాం. నూతన ఉద్యోగ నియామకాలు, నూతల బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లా లోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నాం.
ఈ రెండు ఆర్టీసీ డిపోలకు సంబంధించి నిన్న ఆర్డర్లు వచ్చాయి. ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి సీతక్క గారికి పెద్దపల్లి ఆర్టీసీ డిపో సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే విజయరమణ రావు కి ఆర్డర్లు అందిస్తున్నాం. ఆర్టీసీ ముందుకు వస్తుందనడానికి ఇదే నిదర్శనం. రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు మూడు రాష్ట్రల సరిహద్దు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందుస్తు త్వరలోనే బస్సు డిపో నిర్మాణాలు ప్రారంభిస్తాం. పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం జిల్లా కేంద్రం చేసిన అక్కడ బస్సు డిపో లేకపోవడంతో రవాణా శాఖ మంత్రిగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయరమణారావు విజ్ఞప్తి మేరకు అక్కడ బస్సు డిపో మంజూరు చేయడం జరిగింది. ఇక రెండు జిల్లాల ప్రజలకు నూతన బస్సు డిపో మంజూరు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.