తెలంగాణ గురుకులలో దారుణం..మరో ఇద్దరు విద్యార్థులకు పాము కాటు..ఇద్దరు మృతి !

-

తెలంగాణ గురుకులలో దారుణం..ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులకు పాము కాటు చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాట్ల కలకలం చోటు చేసుకుంది. నిన్న అఖిల్ అనే విద్యార్థిని కాటేసింది పాము. ఈ రోజు యస్విత్ అనే 8వ తరగతి విద్యార్థిని కాటేసింది పాము. దీంతో కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు యస్విత్, అఖిల్.

Two students were bitten by a snake

అంతకు ముందు..ఇదే జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ ను పాము కాటేసింది. గతంలో ఇదే పాఠశాలలో పాము కాటుకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అటు దీనిపై సర్కార్ సరిగా వ్యవహరించడం లేదంటూ ఫైర్ అవుతున్నా బీఆర్ఎస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news