కాకా వెంకట స్వామి రాజకీయాల్లో లెజెండ్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కాకా వెంకట స్వామి రాజకీయాల్లో లెజెండ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాకా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వెంకటస్వామి చేయని పదవీ లేదు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారని అన్నారు. దివంగత కాకా మా అందరికీ స్పూర్తి అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు మంచి విద్యనందిస్తున్నారని తెలిపారు.

విద్యా సంస్థలను కరస్పాండెంట్ సరోజా సక్సెస్ పుల్ గా రన్ చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం మంచి శుభపరిణామం అన్నారు. లాభా పేక్ష లేకుండా విద్య అందించడం చాలా అరుదు అన్నారు. విద్యా సంస్థలకు ఎలాంటి సాయం కావాలన్న చేస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ బలపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృసి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ను కూడా రిక్రూట్ చేయలేదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news