TSPSC ఛైర్మన్ రాజీనామాతో నిరుద్యోగుల సంబురాలు

-

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్​గా జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నిరుద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ అశోక్ నగర్​లో నిరుద్యోగ అభ్యర్థులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఛైర్మన్ రాజీనామాతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు నాంది పడినట్లేనని నిరుద్యోగులు అన్నారు. కమిషన్​కు పెద్ద అడ్డుగోడగా నిలిచిన జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.

ఈ సంబురాల్లో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 2023 ఎన్నికలు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రియాజ్ తెలిపారు. దశాబ్ద కాలంగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను వంచిందని ఆరోపించారు. రే ఆఫ్ ది హోప్​గా కనిపించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన తర్వాత నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచారని వివరించారు. కాంగ్రెస్ విజయం అంటే నిరుద్యోగుల విజయంగా భావించాలని ఆయన అన్నారు. భవిష్యత్తు తెలంగాణ ఉద్యోగుల తెలంగాణగా రియాజ్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news